వీడ్కోలయ్యా.. గోళూరు గణపయ్యా
తుమకూరు: చరిత్ర ప్రసిద్ధ చెందిన గోళూరు మహా గణపతి నిమజ్జనం మహోత్సవం ఆదివారం వేలాది మంది భక్తులు సమక్షంలో నేత్రపర్వంగా జరిగింది. వినాయక చవితికి కాకుండా బలి పాడ్యమి రోజున ఇక్కడ భారీ ఏకదంతున్ని ప్రతిష్టించి పూజలు చేయడం సంప్రదాయం. కార్తీక మాసం మొత్తం పూజలు సాగాయి. ఉదయం నుంచి పూజలు, హోమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. తరువాత నిమజ్జనం ఊరేగింపు ఆరంభమైంది. గోళూరు చెరువులో గంగ ఒడిలో నిమజ్జనం చేశారు. జిల్లాతో పాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామంలోని 18 గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment