శివాజీనగర: రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజల సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. బెంగళూరు, రాష్ట్రంలో 24 మంది పాకిస్తాన్, 159 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 115 మంది బంగ్లాదేశీయులు నకిలీ ఆధారాలతో నివాసం ఉంటున్నట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ విధాన పరిషత్‌లో తెలిపారు. ఈ కేసుల కోసం బెంగళూరులో ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమంగా రావడం కొత్తేమీ కాదని, లక్షలాది మంది దేశంలోకి వస్తున్నారని అన్నారు. సరిహద్దులను దాటుకుని ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. అక్రమంగా ఉంటున్నవారిని పంపించి వేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆఫ్రికా నుంచి వచ్చి డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నారు, స్టూడెంట్ వీసాతో వచ్చి ఈ దందా చేస్తారు. వారిని కనిపెట్టేందుకు ప్రతి జిల్లాలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment