బెళగావి అసెంబ్లీ సమాప్తం
● నేటి నుంచి మండ్యలో కన్నడ సాహితీ సమ్మేళనం
శివాజీనగర: బెళగావిలోని సువర్ణ విధానసౌధలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం సాయంత్రంతో సమాప్తమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి అసెంబ్లీ ఆరంభమైంది. మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ మరణంతో ఒకరోజు సభ సాగలేదు. చివరకు 8 రోజులకే పరిమితమైంది. సీఎం సిద్దరామయ్య, మంత్రులు శుక్రవారం మండ్యకు వెళతారు. అక్కడ జరిగే అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనంలో పాల్గొనడం కోసం ఒకరోజు ముందుగానే సభలను ముగించారు. మరోవైపు మండ్యలో సమ్మేళనానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాహితీవేత్త గో.రు. చెన్నబసప్ప సమ్మేళనం అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ప్రపంచ దేశాల నుంచి కన్నడ అభిమానులు, సాహితీవేత్తలు రానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. వేలాది అతిథుల కోసం భారీమొత్తంలో అల్పాహారాలు, భోజనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment