క్రీ.పూ. నాటి శాసనం లభ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీ.పూ. నాటి శాసనం లభ్యం

Published Fri, Dec 20 2024 12:45 AM | Last Updated on Fri, Dec 20 2024 12:45 AM

క్రీ.పూ. నాటి శాసనం లభ్యం

క్రీ.పూ. నాటి శాసనం లభ్యం

తుమకూరు: రాయచూరు జిల్లా మలియాబాద్‌ వద్ద కన్నడ రాజు అమోఘవర్ష కాలంనాటి శిలాశాసనం ఒకటి బయల్పడింది. తుమకూరు విశ్వవిద్యాలయ చరిత్ర, పురాతత్వ అధ్యయన విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ ఎం.కొట్రేష్‌ పరిశోధనలో ఈ శాసనాన్ని కనుగొన్నారు. మలియాబాద్‌ కోట ఆవరణలో కూలీలు ముళ్లకంపలను శుభ్రం చేస్తుండగా ఈ శాసనం దొరికింది. ఈ శాసనం రాష్ట్రకూటుల రాజు అమోఘవర్ష పాలనావధి అంటే క్రీ.పూ.850వ ఏడాది నాటిది అని, 20 వరుసల్లో రాసి ఉందని అన్నారు. ఈ శాసనంలో బల్లాళేశ్వరపురం గురించి ఉల్లేఖించారు. ఈ బల్లాళేశ్వరపురం ఏది అనేది కనుగొనాల్సి ఉంది. పల్లవాన్వయ అనే విషయం గురించి కూడా ప్రస్తావించారు. తుమకూరు జిల్లాతో సంబంధాన్ని చూపుతోంది. తుమకూరు జిల్లా సరిహద్దుల్లోని హెంజేరు లేదా హేమావతి నొళంబుల రాజధాని. ఈ నొళంబులకు పల్లవాన్వయ అని పిలవడం ఈ శాసనంలో కనిపించిందని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement