నాసిరకం ఔషధాలదే పాపం
శివాజీనగర: రాష్ట్రంలో బాలింతల మరణాలపై న్యాయ విచారణ జరిపిస్తామని వైద్య ఆరోగ్య మంత్రి దినేశ్ గుంగూరావు గురువారం విధానసభలో ప్రకటించారు. బాలింతల మరణాలపై చర్చలో సమాధానమిచ్చిన ఆయన, విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఈ మరణాలకు బాధ్యత ఎవరనేది నిర్ధారించాల్సి ఉంది. సీఎం సిద్దరామయ్యను ఒప్పించి ప్రస్తుత జడ్జితో నే న్యాయ విచారణను చేపడతామని తెలిపారు. తప్పు చేసినవారు ఎవరనేది బహిరంగం కావాలని, కారకులు ఎవరైనా చర్యలు తీసుకొంటామన్నారు. నాసిరకం ఔషధాల వల్లనే ఇదంతా జరిగింది. ఔషధాలు సరఫరా చేసిన కంపెనీలనూ విచారిస్తామని చెప్పారు. బళ్లారితో పాటు బాలింతల మరణాలతో పాటుగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగాయనేది విచారణ చేయిస్తామని చెప్పారు.
ఔషధ కంపెనీలపై ధ్వజం
దేశంలో ఫార్మా కంపెనీల లాబీ బలంగా ఉంది, నాణ్యమైన ఔషధాలను ఎగుమతి చేస్తారు, స్థానికంగా వాడకానికి తక్కువ రకం ఔషధాలను ఉత్పత్తి చేస్తారని తెలిసిందని మంత్రి ఆరోపించారు. కోల్‌కతాలోని ఔషధ కంపెనీలో ఉత్పత్తి కేంద్రం సరిగా లేదనేది తెలుసుకొని ఆ కేంద్రం ఉత్పత్తిని నిలిపివేయాలని సూచించామన్నారు. ఆ కంపెనీపై విచారణ జరిపి పరిహారాన్ని ఇప్పిస్తామని చెప్పారు.
వాటి వల్లనే బాలింతల మరణాలు
న్యాయ విచారణ జరిపిస్తాం
మందుల కంపెనీలపై చర్యలు
అసెంబ్లీలో మంత్రి దినేశ్
Comments
Please login to add a commentAdd a comment