సిద్దగంగా మఠానికి సర్కారు షాక్
తుమకూరు: ఎవరో వాడుకున్న రూ.70 లక్షల విద్యుత్ బిల్లును దయ ఉంచి మీరు చెల్లించాలని కోరితే ఎలా ఉంటుంది?, అదే పరిస్థితి ఆ మఠానిది. లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా అన్నం, అక్షరం, వసతి దాసోహ సేవలను అందిస్తున్న చారిత్రక ప్రసిద్ధ సిద్దగంగా మఠానికి సర్కారు నుంచి షాక్ వచ్చింది. రూ. 70 లక్షల కరెంటు బిల్లు కట్టాలని కర్ణాటక పారిశ్రామిక ప్రదేశాభివృద్ధి మండలి (కేఐఏడీబీ) లేఖ రాసింది. నిజానికి మఠం విద్యుత్‌ను వాడినందుకు ఈ బిల్లు రాలేదు. ప్రభుత్వ నీటిపారుదల పథకానికి కేఐఏడీబీ విద్యుత్‌ను వాడుకుంది, తమ వద్ద నిధులు లేవు కాబట్టి సిద్దగంగా మఠాన్ని ఈ సొమ్మును సర్దుబాటు చేయాలని కోరడం విశేషం. సిద్దగంగా మఠానికి సమీపంలోనే ఉన్న దేవరాయపట్టణ చెరువుకు కేఐఏడీబీ పైప్‌లైన్ ద్వారా హొన్నేనహళ్లి నుంచి తాగునీటిని సమకూర్చే ఉద్దేశంతో నీరు పారించారు.
చెల్లించలేమని మఠం జవాబు
ఏప్రిల్‌లోనే బిల్లు కట్టాలని మఠానికి లేఖ పంపారు. స్వామీజీలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మరోసారి మౌఖికంగా కోరారు. మఠం ఎందుకు అంత డబ్బును భరించాలని కేఐఏడీబీ అధికారులు, ప్రభుత్వ తీరుపై మఠం భక్తులు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇలాంటి లేఖ రాయడం సిగ్గుచేటని, గ్యారంటీలకు డబ్బులు సమకూర్చలేక ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాము అంత డబ్బు చెల్లించలేమని మఠం పీఠాధిపతి సిద్దలింగస్వామి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు.
రూ.70 లక్షల సర్దుబాటుకు సూచన
భక్తుల తీవ్ర ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment