మండ్య: జిల్లాలోని నాగమంగల తాలూకా మరడీపుర గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు సంతోష్ తమ కుటుంబ సభ్యులతో ఎద్దులబండిలో మండ్యలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న 87వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనానికి బయలుదేరారు. మన పూర్వీకులు నాడు పండుగలు, పబ్బాలు, జాతరలకు ఒక ఊరి నుంచి మరొక ఊరికి ఎద్దులబండిలోనే వెళ్లేవారని జనం గుర్తుచేసుకున్నారు. ఆనాటి సంస్కృతికి అద్దం పట్టేలా సాహితీ సేద్యానికి బండిలో బయల్దేరినట్లు సంతోష్ చెప్పారు. తమ తాత వినియోగించిన పాత ఎద్దులబండిని అరటి పిలకలు, పూలమాలలు, కన్నడ జెండాలతో సింగారించి 45 కి.మీ.ల దూరంలోని మండ్యకి బయలుదేరారు. చాలామంది ఫోటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment