యశవంతపుర: బెళగావి అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు, తరువాత పోలీసులు అరెస్టు చేయడం, విడుదల పరిణామాల మధ్య బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి భార్యతో కలిసి ఆలయాల దర్శనం చేసుకుంటున్నారు. చిక్కమగళూరులోని రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. కాగా, ఆయన బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు భారీ ర్యాలీగా వచ్చారు. అప్పుడు 7 అంబులెన్స్‌లు సైరన్, లైట్ వేసుకొని ఊరేగింపులో పాల్గొన్నాయి. దీంతో ఆ డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రౌడీలూ.. అతి చేయొద్దు
మైసూరు: నగరంలోని హెబ్బాళ, విజయనగర, మేటెగళ్లి, సరస్వతీపురం 4 ఠాణాల పరిధిలో 100 మంది రౌడీషీటర్లకు ఆదివారం పోలీసులు పరేడ్ నిర్వహించారు. రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీల గొడవలు, దోపిడీలు తదితరాలకు పాల్పడినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. గుంపు గొడవలు, తాగి కొట్లాడినా అరెస్టు చేస్తామని చెప్పారు. ఏసీపీ ఎన్.జీ.గజేంద్ర ప్రసాద్, ఇన్స్‌పెక్టర్‌లు ఎ.మల్లేష్, దివాకర్, సురేష్ కుమార్, పురుషోత్తం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment