కలబుర్గి బంద్
● కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు
వ్యతిరేకంగా సంఘాల నిరసన
సాక్షి, బళ్లారి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కించపరిచారంటూ మంగళవారం కలబుర్గిలో సంవిధాన రక్షణ హోరాట సమితి, దళిత సంఘాలు బంద్ జరిపాయి. వేలాది కార్యకర్తలు బృహత్ ర్యాలీ నిర్వహించారు. సంఘాల కార్యకర్తలు అంతటా తిరుగుతూ బంద్‌ని విజయవంతం చేశారు. ఆందోళనకారులు మాట్లాడుతూ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని, లేకపోతే బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. అంబేద్కర్ మా అందరికీ దేవుడని, ఆయన పేరు తలుచుకుంటేనే తమకు జీవితాలు ఉంటాయని అన్నారు. వాహన రాకపోకలు స్తంభించాయి. టైర్లు కాల్చి నిరసనలు తెలిపారు. బిగ్గరగా జై భీం అని నినాదాలు చేశారు. బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. అలాగే బళ్లారిలో కూడా ప్రజా పరివర్తన వేదిక, చలవాది మహాసభ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment