బనశంకరి: బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి.. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ను దూషించిన కేసును సీఐడీ దర్యాప్తు చేస్తుందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడుతూ విచారణలో ఉండగా ఈ కేసు గురించి ఎక్కువగా మాట్లాడరాదన్నారు. నిజానిజాలు పరిశీలించి సీఐడీ నివేదిక అందజేస్తుందని తెలిపారు. సీటీ.రవి అసభ్యపదజాలం వాడలేదంటున్నారు, అక్కడ జరిగింది వేరే అని మంత్రి లక్ష్మీ పక్కన ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు, సీటీ.రవి మాటలతో పాటు అన్ని విషయాలపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తుందని పరమేశ్వర్ చెప్పారు. సీటీ రవి కేసు ముగిసిన అధ్యాయమని విధాన పరిషత్ సభాపతి బసవరాజ హోరట్టి చెప్పడంపై, సభాపతి, పోలీసులు ఎవరి పని వారు చేస్తారని అన్నారు.
కేంద్ర మంత్రి అసమర్థుడా?
సీటీ రవి దాడి ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని ప్రశ్నించగా, కొన్ని కారణాలతో ఆలస్యం కావచ్చు, సీఎం లేదా హోంమంత్రి ఆదేశాలను పోలీసులు పాటిస్తారు, ఇతరుల ఆదేశాలను కాదు అని అన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి అసమర్థుడంటే ఆయన ఒప్పుకుంటారా? అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పాత హుబ్లీ ఇన్స్‌స్పెక్టర్ సురేశ్ యళ్లూర పై లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు.
దూషణపై సమగ్ర దర్యాప్తు: హోంమంత్రి
Comments
Please login to add a commentAdd a comment