ఎండీ చిత్రం డీపీ.. కంపెనీకి టోపీ
బనశంకరి: ఐటీ కంపెనీ ఎండీ ఫోటో, లోగోను ఉపయోగించి అక్రమంగా నగదు బదిలీ చేసుకున్న ముఠాని మంగళవారం ఆగ్నేయ విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్‌చేశారు. తెలంగాణకు చెందిన గ్రీష్మా, ఎన్.దినేశ్ హరాత్, పవన్‌కుమార్, సాయికుమార్ ఎనుముల తదితరులు నిందితులు. బెంగళూరులోని ఓ కంపెనీ ఎండీ ఫోటో, లోగోను వాట్సాప్ డీపీలో పెట్టి, డిసెంబరు 6వ తేదీన కంపెనీ అకౌంటెంట్‌కు ఒక మెసేజ్‌ని పంపారు. ప్రాజెక్ట్ అడ్వాన్స్ కోసం అత్యవసరంగా రూ.56 లక్షలు తమ ఖాతాకు బదిలీచేయాలని సూచించారు. నిజమని నమ్మిన అకౌంటెంట్, కంపెనీ అకౌంట్ నుంచి నగదు జమచేశారు. తరువాత ఎండీకి తెలిసి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ ఖాతాకు నగదు
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగదు హైదరాబాద్‌లోని వ్యక్తి ఖాతాకు జమైందని గుర్తించి అతనిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టగా మిగతా ఐదు మంది గురించి చెప్పాడు. వారిని అరెస్ట్ చేశారు. మోసగాళ్లు ఆ నగదును విత్‌డ్రా చేసి బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి విక్రయించారు. అలాగే లగ్జరీ ఆడి ఏ–4 కారును కొని జల్సాలు చేశారు. నిందితుల నుంచి రూ.5.8 లక్షల నగదు, ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
రూ. 56 లక్షల వసూలు
ఘరానా ముఠా పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment