రౌడీషీటర్ల ఇళ్లలో ఖాకీల సోదాల పర్వం
దొడ్డబళ్లాపురం: నూతన సంవత్సరం సందర్భంగా నగర పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే సీసీబీ పోలీసులు రౌడీల ఇళ్లల్లో కార్డన్ సెర్చ్ చేపట్టారు. కొడవళ్లు, కత్తులు తదితర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ రౌడీ ఇంట్లో రివాల్వర్ కూడా దొరికింది. ముఖ్యంగా పోలీసులు బ్యాడరహళ్లి, పరప్పన అగ్రహార, మాదనాయకనహళ్లి తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టారు. మారణాయుధాలు లభించిన రౌడీ షీటర్లపై కేసులు నమోదు చేశారు.
రౌడీ ఇంట్లో మచ్చుకత్తులు
కృష్ణరాజపురం: కేఆర్ పురం పరిధిలో సుమారు 40 మంది రౌడీషీటర్ల ఇళ్లలో గాలింపు జరిపారు. మాదనాయకనహళ్లికి చెందిన రౌడీషీటర్ కుళ్ల శివరాజ్ ఇంటిలో మచ్చు కత్తులు, కొడవళ్లు, లాంగ్‌లు లభించాయి. వాటితో సహా శివరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. మాదనాయకనహళ్లి తదితర చోట్ల ఈ దాడులు జరిగాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, శాంతిభద్రతలకు భంగం కలిగించరాదని అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment