చీటర్.. ఈ టికెట్ కలెక్టర్
● ఉద్యోగాల పేరుతో వసూళ్లు
యశవంతపుర: సులభంగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కిన రైల్వే ఉద్యోగి కటకటాల పాలయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులను పాస్ చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న బెంగళూరు రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్‌స్పెక్టర్ గోవిందరాజు (49)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తుల సాయంతో ఇటీవల పోటీ పరీక్షలు రాసిన అభ్యుర్థులను కలిసిన నిందితుడు పోటీ పరీక్షలకు సంబంధించి తనకు తెలిసిన అధికారులు పరీక్షలు పాస్ చేసి పోస్టింగ్ ఇప్పిస్తాని నమ్మించాడు. అభ్యర్థుల నుంచి పీడీఓ పోస్టుకు రూ.25 లక్షలు, కేఏఎస్ ప్రిలిమ్స్ పరీక్షకు రూ.50 లక్షలు ఒప్పందం కుదుర్చుకునేవాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం గోవిందరాజును విజయనగరలో పోలీసులు అరెస్ట్ చేశారు. 46 మంది ఆభ్యర్థుల పేర్లు, చెక్కులు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
దర్శన్ బెయిలు రద్దుకు సుప్రీంకు ఖాకీలు?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె బెయిలుపై విడుదలైన ప్రముఖ నటుడు దర్శన్, అనుచరులకు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని హోంశాఖ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా దర్శన్‌తో పాటు మొత్తం నిందితుల బెయిలు రద్దు కోరుతూ చార్జ్‌షీట్‌ను ఇంగ్లీషులో తర్జుమా చేస్తున్నారు. లాయర్ అనిల్ నిషాని ని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment