మైసూరు: అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం మైసూరు నగరంలో జరిగింది. హైదరాబాద్కు చెందిన సాయికృష్ణ (30), సందీప్ (31) మృతులు కాగా, జగదీష్, డ్రైవర్ హరికృష్ణ గాయపడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్కీలుగా పనిచేసేవారు కొత్త సంవత్సర వేడుకల కోసం చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపురకు వెళ్లేందుకు మైసూరుకు స్కోడా కారులో వచ్చారు. ఆ సమయంలో చామరాజ డబుల్ రోడ్డులో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఘటనలో హరికృష్ణ, సందీప్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు స్థానికుల సహకారంతో క్షతగాత్రులను కేఆర్ ఆస్పత్రికి తరలించారు. సందీప్, సాయికృష్ణ మరణించగా మిగతా ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
మైసూరులో చెట్టును ఢీకొన్న కారు
Comments
Please login to add a commentAdd a comment