బనశంకరి: కాంట్రాక్టర్ సచిన్ పాంచాల్ ఆత్మహత్య కేసులో మంత్రి ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేసే ప్రశ్నే లేదు, అవి రాజకీయ ద్వేషంతో చేసిన ఆరోపణలని సీఎం సిద్దరామయ్య అన్నారు. బుధవారం విధానసౌధలో విలేకరులతో సిద్దరామయ్య మాట్లాడారు. బీదర్ కాంట్రాక్టర్ డెత్‌నోట్‌లో మంత్రి ప్రియాంక్‌ఖర్గే పేరు లేదని, ఆయన ప్రమేయం గురించి సాక్ష్యం కూడా లేదని, దీంతో రాజీనామా చేసే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఎలాంటి విచారణకై నా సిద్ధమని మంత్రి చెప్పారన్నారు. కానీ గతంలో ఇలాంటి కేసులో బీజేపీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప పేరును డెత్‌నోట్‌లో ప్రస్తావించారని తెలిపారు. సచిన్ కేసును సీఐడీ కి అప్పగించామన్నారు. ఇది రాజకీయ పగతో చేసిన ఆరోపణలని బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉండగా ఒక్క కేసును కూడా సీబీఐకి ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో అసభ్యంగా దూషించిన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ.రవి కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందిందన్నారు. కాగా, హైకమాండ్‌తో చర్చించి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.
కాంట్రాక్టరు ఆత్మహత్యపై స్పందన
Comments
Please login to add a commentAdd a comment