యశవంతపుర: కలబుర్గి నేతల వేధింపులను తట్టుకోలేక బీదర్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ సచిన్ పాంచాళ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని చూస్తోందని మృతుని సోదరి సురేఖ ఆరోపించారు. అన్న ఆత్మహత్య గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని తెలిపారు. గురువారం బీదర్ జిల్లా బాల్కీ తాలూకా కట్టితోగాంవ్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. సచిన్ కలబుర్గిలో పనులు చేయలేదు. మమ్మల్ని కలవలేదు. అసలు సచిన్ పుట్టలేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇవి గమనిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. అన్న సచిన్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. డెత్‌నోట్‌లో రాసిన విషయాలను వదిలేసి అన్ని విషయాలపై తమనే పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు గురించి ఏమీ చెప్పడం లేదు. ఎఫ్‌ఎస్‌ఎల్, పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. ప్రధానికి ఇవే అంశాలపై లేఖ రాయనున్నట్లు చెప్పారు. మరోవైపు సచిన్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని విశ్వకర్మ కుల సంఘాలు ధర్నాలు చేపట్టాయి.
సర్కారుపై సోదరి ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment