● సిద్దరామయ్య వర్గం శక్తి ప్రదర్శన
శివాజీనగర: రాష్ట్రంలో సీఎం కుర్చీ విషయంలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్ మధ్య పోటీ ఉంది. వర్గ రాజకీయం ఉందనే మాటలు వినిపిస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీ.కే.శివకుమార్ విదేశీ పర్యటనలో ఉన్నపుడే బెళగావిలో సతీశ్ జార్కిహొళి ఇంటిలో సీఎం సిద్దరామయ్యతో పాటుగా 35 మంది మంత్రులు డిన్నర్ మీటింగ్ చేశారు. ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ బెళగావి సమావేశంపై ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ స్పందించారు. అటు ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ విదేశాల పర్యనటకు వెళ్లటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గం, ఇటు మంత్రి సతీశ్ జార్కిహొళి ఇంటిలో 35 మంది ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ జరిపి శక్తి ప్రదర్శన చేసింది. డీ.కే.శివకుమార్ అంటే కాంగ్రెస్‌లో లెక్కలేనట్లుగా ఉందనేది అర్థమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment