శివాజీనగర: మాజీ మంత్రి వర్తురు ప్రకాశ్ పేరు చెప్పుకొని బంగారు ఆభరణాలు దుకాణం యజమానికి రూ.2.42 కోట్లు మోసగించిన కేసులో న్యాయ విచారణలో ఉన్న శ్వేతాగౌడపై మరో కేసు నమోదైంది. బంగారు ఆభరణాలు తీసుకొని తనను మోసం చేసిందని శివమొగ్గకు చెందిన ఓ మహిళ శ్వేతా గౌడపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జైలులో శ్వేతాగౌడను బాడీ వారెంట్‌పై అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment