ఇద్దరు లంచగొండ్లకు బేడీలు
శివమొగ్గ: రాష్ట్రంలో పలుచోట్ల లోకాయుక్త దాడులు జరిపి లంచగొండి అధికారులను అరెస్టు చేసింది. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న నీటిపారుదల మండలి ఇంజినీర్, కార్యాలయ సిబ్బందిని పట్టుకున్నారు. వివరాలు.. నీటిపారుదల శాఖ పరిధిలో 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి నెల వరకు శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా గోంధి కుడి కాలువలో పూడిక తొలగించారు. ఇందుకుగాను కాంట్రాక్టరు రూ.9.16 లక్షల బిల్లును మంజూరు చేయాలని అర్జీ వేశారు. భద్రా యోజన బీఆర్‌పీ వ్యాప్తి డీబీహళ్లి సర్కిల్ సెక్షన్ ఆఫీసర్ (ఇన్‌చార్జి ఏఈఈ) కొట్రప్ప, లైట్ మజ్దూర్ అరవింద్ రూ.1.20 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త అధికారులకు ఉప్పందడంతో కార్యాలయంలో లంచం సొమ్ము స్వీకరిస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నారు. లోకాయుక్త ఎస్పీ కే.మంజునాథ్ చౌదరి, అధికారులు పాల్గొన్నారు.
కలబురగి జిల్లాలో ఎఫ్‌డీఏ
యశవంతపుర: కలబురగి జిల్లాలో అంగనవాడి పోస్టును ఇప్పిస్తానని మహిళకు శిల్పా అనే ఎఫ్‌డీఏ బేరం పెట్టింది. రూ.50 వేలు డిమాండ్ చేయగా రూ.35 వేలకు కుదిరింది. గురువారం రూ.15 వేలు తీసుకొంటుండగా లోకాయుక్త పోలీసులు శిల్పాను అరెస్ట్ చేశారు.
శివమొగ్గ జిల్లాలో లోకాయుక్త దాడులు
Comments
Please login to add a commentAdd a comment