విచ్చలవిడిగా వసూళ్ల దందా
కలబుర్గిలో మాయలేడి అరెస్టు
యశవంతపుర: కలబుర్గి నగరంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. వ్యాపారులను, పోలీసు కానిస్టేబుల్స్‌ను ఆమె హానీ ట్రాప్ చేస్తోందని తెలిసింది. కలబుర్గి సైబర్ క్రైం ఠానాలో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పూజా డోంగరరాంవ్ అనే మహిళ వల విసిరి రూ.8 లక్షలు వసూలు చేసింది. ఆమె వేధింపులను తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు హనీ ట్రాప్ దందా గురించి తెలిసింది.
వసూళ్ల పర్వం ఇలా
పూజా పనే హనీ ట్రాప్ అని, కేసులు కొత్త కాదని తెలిసింది. గతంలో అమరసింగ్ అనే వ్యక్తి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసింది. తరువాత బాధితుడు కలబుర్గి వర్శిటీ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాడు. పూజా ప్రభు హిరేమఠ, రాజు లేగంటితో కలిసి వ్యాపారవేత్త వినోద కుమార్ ఖేణికి వల వేసి రూ.34 లక్షలు దండుకుంది. ఈ ఘటనలో 7 మందిపై కేసు నమోదైంది. పూజా నగరంలో శ్రీమంతులను గుర్తించి అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి పరిచయం చేసుకొనేది. ఇప్పుడు పోలీసు కానిస్టేబుల్స్‌ను పూజా ముగ్గులోకి లాగిన విషయం నగరమంతటా చర్చనీయాంశమైంది. పోలీసులు ఆమెను, అనుచరులను నిర్బంధించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment