ఆర్టీసీ బస్ చార్జీల పెంపు
బనశంకరి: కొత్త ఏడాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేదు వార్తను చెప్పింది. ఆర్టీసీ ప్రయాణం మరింత భారం కానుంది. కేఎస్ ఆర్టీసీ నాలుగు మండళ్ల డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం బస్సు టికెట్ల రేట్ల పెంపునకు సమ్మతించింది. టికెట్ ధరలను 15 శాతం పెంచడానికి రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. చార్జీలను పెంచకపోతే మరింత నష్టాలు తప్పవని ఆర్టీసీ మండళ్లు సర్కారును కోరుతున్నాయి.
నారీ శక్తి, ఇతర ఖర్చులు
జనవరి 5వ తేదీ నుంచి కొత్త టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయి. ధరలు పెంచే అవకాశముందని రవాణా మంత్రి రామలింగారెడ్డి ఇటీవల తెలిపారు. నారీ శక్తి వల్ల తీవ్ర నష్టం వస్తోందని, నిర్వహణ, జీతాల ఖర్చు పెరిగిపోయిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కేబినెట్ భేటీ జరిగింది. టికెట్ రేట్ల పెంపునకు సరే అన్నారు. 15 శాతం పెంపు ఉండవచ్చునని, ఆదేశాలు వచ్చాక స్పష్టత వస్తుందని చెబుతున్నారు. గత నాలుగేళ్ల క్రితం బస్ చార్జీలను పెంచారు.
సర్కారు కొత్త ఏడాది కానుక
15 శాతం బాదుడు!
5వ తేదీ నుంచి అమలు
Comments
Please login to add a commentAdd a comment