చెరువులోకి కారు పల్టీ, ఇద్దరు బలి
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర బెట్టకు వెళుతున్న కారు చెరువులో పడి ఇద్దరు మరణించిన ఘటన కొళ్లెగాల తాలూకాలోని కుంతూరు చెరువులో జరిగింది. మైసూరులో టెలికాలర్‌గా పని చేస్తున్న శుభ, కారు డ్రైవర్ ఊర్జిత్ మృతులు. రెస్టారెంటు ఉద్యోగి మనిత్‌తో కలిసి శుభ మహదేశ్వరబెట్టకు వెళుతుండగా అర్థరాత్రి కారు అదుపు తప్పి కుంతూరు చెరువులోకి బోల్తా పడింది. మనిత్ ఎలాగో బయటకు వచ్చాడు. కారు బానెట్‌పై నిలబడి అరుస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మనిత్‌ను చెరువులో నుంచి వెలికితీశారు. శుభ, ఊర్జిత్ ఊపిరాడక కారులోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మాంబళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
చెరువులో కారులోని
వారి కోసం గాలిస్తున్న
పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment