అధ్యయనాలతో సరి?
శివాజీనగర: కన్నడనాట ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం (నారీ శక్తి) ఎలా అమలు అవుతోందో తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు, అధికారులు ఇక్కడకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ పథకాల కింద తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు సర్కారు గద్దెనెక్కి ఏడు నెలలు అవుతున్నా ప్రయాణ పథకం అమలైంది లేదు.
కమిటీలు, సర్వేలతో సరి
అప్పట్లో సిద్దరామయ్య సర్కారు ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన వారం రోజుల లోపే నారీ శక్తిని అమలు చేసి మాట నిలుపుకొంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీలు, అధ్యయనాల పేరుతో కాలయాపన సాగిస్తూ కావాలనే ఆలస్యం చేస్తోందని ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో పాటు మహిళా, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నా సర్కారులో ఏమాత్రం చలనం లేదు. దసరాకు రెడీ, సంక్రాంతికి ఓకే, ఉగాదికి సిద్ధం అని రోజుకొక ప్రకటన చేస్తూ రోజులు నెట్టుకొస్తోంది. తాజాగా ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాద్‌రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, మహిళా, శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆయా శాఖల ఐఏఎస్‌లు గురువారం బెంగళూరుకు రానున్నారు. శుక్రవారంరవాణా మంత్రి రామలింగారెడ్డి తో వారు సమావేశమై ఉచిత ప్రయాణం తీరు తెన్నుల గురించి తెలుసుకుంటారు. పథకం వల్ల పడుతున్న ఆర్థిక భారం, ఇతర ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అప్పట్లో సిద్దరామయ్య ప్రభుత్వం ఈ తరహా ఆలస్యం ఏమీ చేయలేదు, మహిళలు స్థానికతను రుజువుచేసే ఆధార్ కార్డు చూపి రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించవచ్చని నాంది పలికారు. ఆ మాత్రం దానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇంత తతంగం ఏమిటా? పలు వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
మహిళలకు ఉచిత ప్రయాణ పథకం
పరిశీలన కోసం నేడు ఏపీ
మంత్రులు బెంగళూరుకు రాక
రవాణా మంత్రితో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment