వరుసగా వాహనాల ఢీ
దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా దాబస్‌పేట వద్ద సోమవారంనాడు వాహనాలు వరుసగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాబస్‌పేట సమీంలోని ఎడేహళ్లి వద్ద 48వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడ ఆర్చ్ ముందు ప్యాసింజర్ ఆటో, కారు, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వీరణ్ణ (55)అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు, ఆటోలు నుజ్జయ్యాయి. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment