హాఫ్ హెల్మెట్లు, సైలెన్సర్లు తుక్కు
రోడ్డుపై వేసిన
హెల్మెట్లు, సైలెన్సర్లు
శివమొగ్గ: హాఫ్ హెల్మెట్, సైలెన్సర్, ఎల్‌ఈడీ లైట్లపై బుల్డోజర్లను నడిపి పోలీసులు ధ్వంసం చేవారు. జిల్లాలోని భద్రావతి పట్టణంలోని రంగప్ప సర్కిల్‌లో జరిగింది. ఇవన్నీ కూడా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అక్రమమే. కొందరు బైకిస్టులు, కార్ల డ్రైవర్లు ఎక్కువ వెలుతురు కోసం అదనంగా ఎల్‌ఈడీ లైట్లను బిగిస్తారు. ఇది చట్ట విరుద్ధమన్నారు. సుమారు 3000 హాఫ్ హెల్మెట్లు, 20 సైలెన్సర్లు, 50 ఎల్‌ఈడీ లైట్లను రోడ్డుపై పరిచి బుల్డోజర్ ఎక్కించారు. ఇటువంటివి ఉపయోగించరాదని ప్రజల్లో జాగృతి కల్పించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ జీకే మిథున్ కుమార్, ఏఎస్పీ అనిల్ కుమార్ భూమరెడ్డి, భద్రావతి డీఎస్పీ నాగరాజ్, ఇన్‌స్పెక్టర్ జగదీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment