శివాజీనగర: మలేషియా కంపెనీలో సొమ్ము పెట్టుబడి పెడితే అధిక లాభం ఇస్తామని తెలిపి రూ.2 కోట్లు మోసగించిన 7 మంది మోసగాళ్లను నగరంలోని హలసూరు గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామ్ థామస్, జ్యోస్ కురువిల, జీన్ కమల్, జాఫర్ సాదిక్ అలియాస్ దీపక్, విజయ్ చిప్టోంకర్ అలియాస్ రవి, అమిత్ అలియాస్ దీపక్, ఊర్వశి గోస్వామి అలియాస్ సోను అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి రూ.44 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
మలేషియాకు చెందిన ఎంఈడీబీ క్యాపిటల్ బెహార్డ్ అనే పేరున నకిలీ కంపెనీ తెరిచిన మోసగాళ్లు.. ధనవంతులను లక్ష్యంగా పెట్టుకొని సంప్రదించారు. ఒక కాంట్రాక్టరును వీరి మాటలను నమ్మి కబ్బన్‌పేటలోని వంచకుల కార్యాలయానికి వెళ్లి రూ.2 కోట్లు ఇచ్చారు. రూ. 3.50 కోట్లు తిరిగి వస్తాయని అతన్ని నమ్మించారు. ఆరంభంలో లాభాలు వచ్చాయని రూ.9 వేలను కాంట్రాక్టర్ ఖాతాలకు బదిలీ చేశారు. ఆపై ఏవో మాటలు చెబుతూ వచ్చారు. మోసపోయినట్లు తెలుసుకొని కాంట్రాక్టర్ డిసెంబర్ 11న హలసూరు గేట్‌పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు, అదే రోజులు ముగ్గురు నిందితులను మెజిస్టిక్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. తరువాత మరో నలుగురిని పట్టుకున్నారు. ప్రధాన వంచకులు మలేషియాలో కూర్చొని ఈ దందాని నడుపుతున్నట్లు వెల్లడైంది.
మోసగాళ్ల ముఠా అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment