దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పోటీ ఏర్పడి పాలన అటకెక్కిందని, ధైర్యం ఉంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పదవుల మార్పిడి ఒప్పందంపై నోరు విప్పాలని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండు చేశారు. సోమవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, సీటు ఖాళీగా లేదని సీఎం సిద్దరామయ్య చెబుతున్నారని, కాంగ్రెస్‌లో పవర్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయన్నారు. సీఎం పదవి మార్పిడి ఒప్పందం గురించి మాట్లాడే ధైర్యం డీకే శివకుమార్‌కు లేకుండా పోయిందన్నారు. మంత్రి రాజన్న, హోంమంత్రి పరమేశ్వర్ డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, మాగడి ఎమ్మెల్యే బాలక్రిష్ణ డీకే శివకుమార్ సీఎం అని ప్రకటించాడని, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు.
డీకేశినే సీఎం: ఎమ్మెల్యే బాలక్రిష్ణ
పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం డీసీఎం డీకే సీఎం అవుతారని మాగడి ఎమ్మెల్యే బాలక్రిష్ణ అన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ సిద్ధరామయ్య తరువాత ఒప్పందం ప్రకారం డీకేకి పదవి లభిస్తుందన్నారు. ఎప్పుడు సీఎంని చేయాలనేది హైకమాండ్ చూసుకుటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment