సీఎం మార్పు లేదు
శివాజీనగర: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మార్పు మీడియా సృష్టే. ఎలాంటి అధికార పంపకాలు లేవు అని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా చెప్పారు. సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేస్తోంది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ముఖ్యమంత్రి మారుతారు, అధికారం పంపకం జరుగుతుందనేది సరికాదు అని చెప్పారు. సీఎంగా సిద్దరామయ్య ఉన్నారు. సరైన సమయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. అధికారం కోసం ప్రతిపక్ష బీజేపీలోనే గొడవ జరుగుతోంది. అక్కడ అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. సర్కారుకు మంచి పేరు రావడంతో తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆంతరంగికంగా నేతలు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment