ప్రాంతీయ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన
యశవంతపుర: బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం కోసం సీఎం సిద్ధరామయ్య శుక్రవారం మంగళూరులో శిలాన్యాస పూజలు చేశారు. గత బడ్జెట్‌లో వర్సిటీకీ నిధులు కేటాయించటంతో శంకుస్థాపన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మించాలని తలపెట్టినట్లు వివరించారు. ఆసియాలోనే రాజీవ్‌గాంధీ ఆరోగ్య వర్సిటీ అత్యంత పెద్దదని అన్నారు. రాష్ట్రంలోని బీపీఎల్ కార్డుదారులకు ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య సేవలను అందించాలని అధికారులకు సూచించారు. అన్ని మెడికల్ కాలేజీల్లోను బీపీఎల్ కార్డుదారులకు ఉచిత అరోగ్యసేవలు అందించాలని మనవి చేశారు. వర్సిటీ పరిధిలో 3.5 లక్షల మంది విద్యార్థులు ఆరోగ్య విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆరోగ్యేవిద్యను అందించటంలో వర్సిటీ సేవలు అపారమన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల స్థాయిలో శుభ్రత నిర్వహణతో పాటు నాణ్యమైన చికిత్స అందేలా చూడాలని అధికారులను అదేశించారు. శ్రీమంతులు, రాజకీయ నాయకులు ఆస్పత్రికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో అత్యుత్తమ ఆరోగ్య సేవలు పేదలకు సులభంగా అందేలా చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment