నమ్మ మెట్రోలో చార్జీల పిడుగు!
శివాజీనగర: ఇప్పటికే బస్సుచార్జీల భారం మోయలేక సతమతమవుతున్న బెంగళూరు నగరవాసిపై మరో భారం పడనుంది. నమ్మ మెట్రో చార్జీల పెంపునకు బీఎంఆర్‌సీఎల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం బీఎంఆర్‌సీఎల్ అధికారులు, ధర పెంపు కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. చార్జీల పెంపును ఖరారు చేశారు. ఎంత ధర పెరిగిందనే విషయం శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. విశ్వసనీయ సమాచారం మేరకు 15 నుంచి 20 శాతం చార్జీలు పెంచే అవకాశమున్నట్లు తెలిసింది. 2017లో నమ్మ మెట్రో చార్జీలను 10–15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతకు మించి చార్జీల పెంపు ఉండనుంది. బెంగళూరు నగరవాసుల జీవనాడి నమ్మ మెట్రోలో రోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో చార్జీలు పెంచనుండటంతో వారిపై మోయలేని భారం పడనుంది. కాగా మెట్రో నిర్వహణకు ఖర్చులు పెరుగుతుండటంతో చార్జీలు పెంచుతున్నట్లు తెలిసింది.
టికెట్ ధర పెంపునకు బీఎంఆర్‌సీఎల్ గ్రీన్ సిగ్నల్!
15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment