శివాజీనగర: కాంగ్రెస్‌లో అధ్యక్షుడు, సీఎం మార్పుపై చర్చ మరిన్ని పరిణామాలకు తావిస్తుండగా, శుక్రవారం హోం మంత్రి పరమేశ్వర్‌ను సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మహాదేవప్ప కలుసుకొని చర్చించారు. ఉదయం సదాశివనగరలో ఉన్న పరమేశ్వర్ ఇంటికి విచ్చేసిన మహాదేవప్ప సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఏ విషయాల గురించి చర్చించలేదని మీడియాకు తెలిపారు. మహాదేవప్ప భేటీ గురించి మీడియాతో మాట్లాడిన పరమేశ్వర్ ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. వ్యక్తిగత పని నిమిత్తం వచ్చి మాట్లాడారు. ఎందుకు మాట్లాడరాదు? అనేక సార్లు ఆయన వస్తారు. తాను వెళతాను. తాను అనేక సార్లు మంత్రుల ఇంటికి వెళతాను. అల్పాహారం, భోజనానికి వెళ్లకూడదా? అని నిలదీశారు. తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. మహాదేవప్ప వ్యక్తిగత పని నిమిత్తం వచ్చారని అన్నారు. సతీశ్ జార్కిహొళి నివాసంలో డిన్నర్ సభ తరువాత పరమేశ్వర్ దళిత నాయకుల సభ జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమావేశానికి హైకమాండ్ బ్రేక్ వేసింది. అయితే ఆ డిన్నర్ సమావేశాన్ని తాము రద్దు చేయలేదు, వాయిదా వేశామని పరమేశ్వర్ తెలిపారు.
తన నివాసంలో 40 నిమిషాల పాటు చర్చ
అల్పాహారానికి వెళ్లకూడదా? అని
నిలదీత
డిన్నర్ సభకు బ్రేక్
నేపథ్యంలో నేతల భేటీ
Comments
Please login to add a commentAdd a comment