సువర్ణసౌధకు బాపూ శోభ
శివాజీనగర: బెళగావిలోని అసెంబ్లీ భవనం సువర్ణసౌధ ఆవరణలో బృహత్ గాంధీజీ విగ్రహం ఆవిష్కృతమైంది. జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం సమావేశం సందర్భంగా మంగళవారం సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీలు బాపూ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బెంగళూరులోని విధానసౌధ ఆవరణలో ఉన్నట్లుగానే ఈ విగ్రహం కూడా ఉంటుంది.
నేల నుంచి 37 అడుగుల ఎత్తు ఉంటుంది. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ 20 టన్నుల కంచును ఉపయోగించి 27 అడుగుల ఎత్తైన మహాత్ముని విగ్రహాన్ని నిర్మించారు. ఖర్గేని, ప్రియాంకని రాష్ట్ర నేతలు ఘనంగా సన్మానించారు. సభాపతి యు.టీ.ఖాదర్ అందరు ఎమ్మెల్యేలకు కేటాయించిన గండభేరుండ పక్షి లోగోను తొడిగారు. సాధ్విని కొప్ప ఉదయవాగలి చెలువ కన్నడ నాడు పాటలను పాడారు. వంద సంవత్సరాల కిందట బెళగావిలో గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సమావేశం జరిగింది, అందులో గాయని గంగుబాయి హానగల్ ఈ పాటలను పాడారు. ఐకమత్యాన్ని చాటేలా యువత, కళాకారుల సాగించిన ప్రదర్శనలు అలరించాయి. తరువాత జై బాపూ సమావేశం భారీఎత్తున నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. నేతలదంరూ బీజేపీని విమర్శలతో విరుచుకుపడ్డారు.
బీజేపీది గాడ్సే సిద్ధాంతం: సీఎం
రామభక్తుడైన మహాత్మాగాంధీని బీజేపీ పరివారానికి చెందిన గాడ్సే హత్య చేశాడని సీఎం తన ప్రసంగంలో ఆరోపించారు. బీజేపీ వారు గాడ్సే సిద్ధాంతాలు పాటిస్తారని దుయ్యబట్టారు. అలాగే అంబేడ్కర్‌ని, రాజ్యాంగాన్ని కూడా ద్వేషిస్తారన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లభించాలి. నీచమైన ఘటనలు జరుగరాదు. సంఘ విద్రోహ శక్తులే ఇటువంటి పనులు చేస్తాయి. వారిపై తీవ్ర చర్యలు తీసుకొంటామని సీఎం సిద్దరామయ్య అన్నారు. సంవత్సరమంతా జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం అభియానను నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంఽధీకి అనారోగ్యం కారణంగా బెళగావి సభకు రాలేకపోయారని, దీనిపై వదంతలు వద్దని అన్నారు. కాగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తరలివచ్చారు.
కళాకారుల ఐక్యతా ప్రదర్శన
37 అడుగుల ఎత్తైన ప్రతిమ ఆవిష్కారం
కాంగ్రెస్ అగ్రనేతల హాజరు
Comments
Please login to add a commentAdd a comment