కట్న పిశాచికి వివాహిత బలి
యశవంతపుర: వరకట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్ జిల్లా ఆలూరు తాలూకా హళ్లియూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. సకలేశపుర తాలూకా బ్యాకెరెగడి గ్రామానికి చెందిన ధన్యశ్రీ (24)ని రెండేళ్ల క్రితం హళ్లియూరుకు చెందిన ప్రేమకుమార్‌తో వివాహం చేశారు. భర్త అత్తమామలు మరింత క ట్నం తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. పుట్టింటికెళ్లిన ధన్యశ్రీ ఆదివారం అత్తవారింటికి తిరిగి వచ్చింది. వచ్చిరాగానే కట్నం డబ్బులు తెచ్చావా అని అడిగారు. ఆమె లేదనగానే భర్త, అత్తమామలు భవాని, ప్రదీప్‌లు ఇష్టానుసారం కొట్టారు. దీంతో ఆవేదనకు గురైన ధన్యశ్రీ సోమవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, తహశీల్దార్‌లు పరిశీలించారు. భర్త, అత్త తదితరులను ఆలూరు పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment