పాల సంఘం భేటీలో ఉద్రిక్తత
● సభ్యురాలి ఆత్మహత్యాయత్నం
మండ్య: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షురాలి ఎంపికకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలో ఓ మహిళా సభ్యురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన తాలూకాలోని హుల్కెరెకొప్పలు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దేవరాజు భార్య మంజుల (48) బాధితురాలు. వివరాలు.. ఒప్పందం ప్రకారం గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల మహిళా సహకార సంఘం పాలక మండలికి అధ్యక్షురాలిగా వీణాను ఎంపిక చేయాల్సింది. అయితే కొందరు సభ్యులు వేరే మహిళను అధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. దీనిని ప్రశ్నిస్తూ ఐదుగురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు, సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. వీణాకు మద్దతుగా మంజుల పురుగుల మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ ఘటనతో హుల్కెరెకొప్పలు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రామంలో పోలీసు బందోబస్తు నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment