రాజధానిలో సామూహిక అత్యాచారం
బనశంకరి: రాజధాని బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన మహిళను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి బంగారు నగలు లాక్కుని పారిపోయిన ఇద్దరు కామాంధులను మంగళవారం పోలీసులు అరెస్ట్‌చేశారు. వివరాలు.. బెంగళూరు కేఆర్.మార్కెట్‌లో కూలిపనులు చేసే గణేశ్ (27), శరవణ (35) నిందితులు. రోజూ కూలిపనులు చేసి హోటల్‌లో తిని సిటీ మార్కెట్ ఫుట్‌పాత్‌లో నిద్రించేవారు.
తమిళనాడులో వంటపాత్రల వ్యాపారం చేసే మహిళ (37) 19వ తేదీ రాత్రి 11.30 సమయంలో తమిళనాడు నుంచి వచ్చింది. యలహంకలోని సోదరుని ఇంటికి వెళ్లడానికి కేఆర్.మార్కెట్ వద్ద సిటీ బస్ కోసం వేచిచూస్తోంది. ఆ వైపు వెళ్లే బస్ రాకపోవడంతో మార్కెట్‌లో ఉన్న నిందితులను అడిగింది. బస్ వచ్చే స్థలం చూపిస్తామని చెప్పి ఎస్‌జే పార్కు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోడౌన్ స్ట్రీట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బంగారు నగలు లాక్కుని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సెంట్రల్ విభాగం మహిళా పోలీసులు ముమ్మరంగా గాలించి అరెస్టు చేశారు.
ఇద్దరు దుండగుల అరెస్టు
కామాంధుని ఆత్మహత్య
యశవంతపుర: బెళగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని తోరణగట్టి గ్రామంలో ఐదేళ్ల బాలికపై ఈరప్ప కరడి (40) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. సోమవారం ఇంటి వద్ద ఆటలాడుతున్న బాలికకు మొబైల్‌ఫోన్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అఘయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో భయపడిన ఈరప్ప కరడి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment