టమాటా సంక్షోభం
యశవంతపుర: టమాటా ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో రైతులు, వ్యాపారులు చెప్పలేకపోతున్నారు. కేజీ రూ. 5 ఉండవచ్చు, లేదా రూ.120 పలకవచ్చు. రేటు వచ్చినప్పుడు అమ్మిన రైతే దొర. ధర తగ్గిపోతే మోతుబరి కూడా అయ్యో అనాల్సిందే. ప్రస్తుతం చిక్కమగళూరు జిల్లాలో టమాటా ధరలు తీవ్రంగా క్షీణించాయి. ఏపీఎంసీ మార్కెట్లో కేజీ రూ.10, అంతకంటే తక్కువే ఉంటోంది. మేలిరకం టమాటాలకు ఈ ధర వస్తోంది. తక్కువ రకమైతే అడిగేవారు లేరు. పంట పుష్కలంగా రావడంతో పాటు డిమాండు పడిపోవడం దీనికి కారణమని దళారులు, వ్యాపారులు చెబుతున్నారు. ధర లేక అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనాలని, లేదంటే లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోతామని తెలిపారు. చవగ్గా వచ్చాయని ఏపీఎంసీలో టమాటాను కొన్ని ఆహార ఉత్పత్తుల సంస్థలు భారీగా కొనేశాయి.
భారీగా పడిపోయిన ధరలు
Comments
Please login to add a commentAdd a comment