కడతేరిన కుటుంబం
సాక్షి, బళ్లారి: యాదగిరి జిల్లాలో భీకర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది మృతి చెందారు. బుధవారం యాదగిరి జిల్లా సురుపుర తాలూకా తింథిణి సమీపంలో బైక్– బస్సు ఢీకొన్నాయి. భార్యాభర్తలతో సహా ముగ్గురు పిల్లలు మరణించారు. హలిసాగరకు చెందిన రైతు ఆంజనేయ (35), గంగమ్మ (30), పిల్లలు పవిత్ర (7), రాయప్ప (5), హనుమంతు (2) ను తీసుకుని పని మీద బైక్‌లో తింథిణి వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు– బైక్ అదుపుతప్పి ఢీకొన్నాయి. ఆంజనేయ దంపతులు, పిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు. సురపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును సీజ్‌చేసి మరో బస్సులో ప్రయాణికులను పంపించారు. ఈ ఘోరంలో హలిసాగరలో విషాదం అలముకొంది.
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ
దంపతులు, ముగ్గురు పిల్లల మృతి
Comments
Please login to add a commentAdd a comment