శివాజీనగర: పన్ను ఎగవేతల ఆరోపణలు రావడంతో బెంగళూరు, మైసూరు, రాష్ట్రంలో 30 చోట్లకు పైగా ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) అధికారులు బుధవారం ఉదయాన్నే ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బడా వ్యాపారులు, బిల్డర్‌ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. మైసూరులో కాంట్రాక్టర్, ఇటుకల ఫ్యాక్టరీలు నడిపే రామకృష్ణ ఇల్లు, ఆఫీసుకు మూడు కార్లలో 10 మందికి పైగా అధికారులు వచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు చేసే కాంట్రాక్టర్ రామ కృష్ణేగౌడ ఇల్లు, ఎంప్రో ప్యాలెస్, హోటల్, కళ్యాణ మండపంతో పాటుగా మైసూరులోని ఐటీ దాడులు నిర్వహించారు. ఎం ప్రో ప్యాలెస్ హోటల్‌కు రాగానే భద్రతా సిబ్బంది నుంచి మొబైల్‌ఫోన్లను లాక్కున్నారు. 3 గంటలకు పైగా సోదాలు సాగాయి. రామకృష్ణేగౌడ కారులో కూడా తనిఖీ చేశారు. కారులో అనేక పత్రాలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment