![భూగర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07blr12b-120011_mr-1738981771-0.jpg.webp?itok=d-3lJAXc)
భూగర్భమార్గం.. మురుగునీటిమయం
రాయచూరు రూరల్ : నగరసభ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మురుగు నీరు అండర్‌పాస్‌లో ఏరులా పారుతోంది. కాంట్రాక్టర్లు మురుగు కాలువల నిర్మాణం ఇష్టానుసారంగా చేపట్టడంతో మురుగు నీరు కాలువలో నుంచి బయటికి ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందిగా మారింది. నగరంలోని విద్యా భారతి పాఠశాలకు వెళ్లే మార్గంలో రైల్వే వంతెన కిందిభాగంలో నిర్మించిన మురుగు కాలువల నుంచి నీరు బయటికి వచ్చి అండర్‌పాస్‌లోకి చేరడంతో గత్యంతరం లేక ఆ నీటిలో గుండానే వాహనదారులు సంచారం కొనసాగిస్తున్నారు. మురుగు కాలువలో ప్లాస్టిక్ సంచులు, బండరాళ్లు, చెత్తా చెదారం నిండి పోవడంతో మురుగు నీరు సజావుగా ముందుకు సాగక రోడ్డుపైకి పారుతోంది. ఆ ప్రాంతంలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. రంగమందిరం నుంచి నిజలింగప్ప కాలనీ, దేవర్ కాలనీ, రాణా ప్రతాప్ కాలనీ, వేంకటేశ్వర కాలనీ, రాంపూర్, కులుసుంబీ కాలనీ, రైల్వే క్వార్టర్లకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెనలోకి చేరిన మురుగు నీరు
నిర్వహణ కరువైన రైల్వే అండర్ పాస్
పట్టించుకోని పాలకులు, అధికారులు
పలు కాలనీలవాసులకు ఇబ్బందికరం
![భూగర్భమార్గం.. మురుగునీటిమయం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07blr12-120011_mr-1738981771-1.jpg)
భూగర్భమార్గం.. మురుగునీటిమయం
![భూగర్భమార్గం.. మురుగునీటిమయం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07blr12a-120011_mr-1738981771-2.jpg)
భూగర్భమార్గం.. మురుగునీటిమయం
Comments
Please login to add a commentAdd a comment