![మార్చి 1న హంపీ ఉత్సవంలో గ్రామీణ క్రీడలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07blr07-120005_mr-1738981773-0.jpg.webp?itok=U0hfEMQ_)
మార్చి 1న హంపీ ఉత్సవంలో గ్రామీణ క్రీడలు
హొసపేటె: హంపీ ఉత్సవాలు– 2025లో గ్రామీణ క్రీడా పోటీలైన కుస్తీ, బండి చక్రం బిగించే పోటీలు, గుండు ఎత్తే పోటీలను మార్చి 1న హొస మలపనగుడి గ్రామంలో నిర్వహించనున్నట్లు హడగలి తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి రమేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో నిర్వహించే పోటీల వివరాలిలా ఉన్నాయి.
పురుషులు, మహిళల కుస్తీ పోటీలు:
నాలుగు విభాగాల్లో జిల్లా స్థాయి పురుషులు, మహిళల కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి పురుషుల రెజ్లింగ్ టోర్నమెంట్ 57–65 కేజీలు, 66–74 కేజీలు, 75–85 కేజీలు, 86 కేజీలకు పైబడిన వారికి రెజ్లింగ్ టోర్నీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి మహిళల రెజ్లింగ్ టోర్నమెంట్‌లో 50 కేజీలు, 51–54 కేజీలు, 55–57 కేజీలు, 58 కిలోలకు పైబడినవారికి రెజ్లింగ్ టోర్నీని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి పురుషుల రెజ్లింగ్ టోర్నమెంట్‌లో 57–65 కేజీలు, 66–74 కేజీలు, 75–85 కేజీలు, 86 కేజీలకు పైబడిన విభాగాల్లో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి చిట్ కుస్తీలో పాల్గొనే మల్లయోధులు విజయనగర జిల్లాకు చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు తీసుకురావాలి. పాయింట్ల ప్రాతిపదికన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు జరుగుతాయి.
విజేతలకు అవార్డులు
రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల రెజ్లింగ్‌లో పోటీల నాలుగు వెయిట్ విభాగాల్లో విజేతలకు హంపీ కిషోర్, హంపీ కుమార, హంపీ కుమారి, హంపీ కేసరి, హంపీ కంఠీరవ, హంపీ మహిళా కంఠీరవ అవార్డులను అందజేస్తారు. రెజ్లింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న రెజ్లర్లు మార్చి 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆసక్తిగలవారు మరింత సమాచారం కోసం మొబైల్ నంబర్లు– 9164693882, 9740110210లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment