![ముగ్గురు ఘరానా నిందితుల అరెస్ట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07blr06-120005_mr-1738981773-0.jpg.webp?itok=G2sLxuRy)
ముగ్గురు ఘరానా నిందితుల అరెస్ట్
● విజయనగర జిల్లా ఎస్పీ
శ్రీహరిబాబు వెల్లడి
● రూ.100 కోట్లకు పైగా మోసానికి
పాల్పడ్డ వైనం
హొసపేటె: నగరంలో కోట్లాది రూపాయల మేర మోసం చేసిన ముగ్గురు నిందితులను నగర పోలీసులు గురువారం గోవాలో అరెస్టు చేశారని విజయనగర జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల మేర మోసం చేసి పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో హొసపేటె పోలీసులు విజయం సాధించారన్నారు. నగరంలో రూ.100 కోట్లకు పైగా మోసం చేసి పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు ముంతాజ్ బేగంతో పాటు ఆమె కూతురు ఆరీఫా బేగం, అల్లుడు జావేద్‌లను గోవాలో అరెస్టు చేశారు.
పరారీలో ఉన్న వారి కోసం గాలింపు
10 రోజుల తర్వాత ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంలో పట్టణ పోలీసులు విజయం సాధించారన్నారు. మొత్తం 8 మంది నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారన్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారన్నారు. హొసపేటె డీఎస్పీ మంజునాథ్ లఖన్ మసగుప్పి, గ్రామీణ సీపీఐ గురురాజ్ కట్టిమని నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందం ముగ్గురు నిందితులను విజయవంతంగా అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసిన నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించామన్నారు. కోర్టు అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment