![స్తంభ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07blr11a-120011_mr-1738981772-0.jpg.webp?itok=c2xGNtc8)
స్తంభించిన రిజిస్ట్రేషన్.. తప్పని పరేషాన్
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో ఆస్తుల, ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఆలస్యం అవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి నగర, జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఆస్తులను, ఇళ్లను విక్రయించిన, కొనుగోలు చేసిన వాటికి సబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 24న కావేరి–2 అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈనేపథ్యంలో జనవరి 8 నుంచి కావేరి–2 అనే సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ పని చేయక రిజిస్ట్రేషన్లు స్తంభించి పోవడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎదురు చూపులే శరణ్యం
గ్రామీణ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి 35–45 కి.మీ దూరం నుంచి వచ్చి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇంటర్ నెట్ సర్వర్‌లో సమస్య ఏర్పడిందని, దాని వల్ల ఆస్తులు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల నమోదు విషయంలో ఆలస్యం కావడంతో రోజు వందలాది రూపాయలు వ్యయం చేసినా పనులు కాకపోవడంతో ప్రజలు పాలకులు, అధికారులపై శాపనార్ధాలు పెడుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు ఎక్కువగా వస్తూ రద్దీగా ఉంటున్నా నెట్ సర్వర్ మొరాయిస్తుండటంతో ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. కంప్యూటర్లలో నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరుగుతూ నానాయాతన పడుతున్నారు.
మొరాయిస్తున్న కంప్యూటర్ సర్వర్
అందుబాటులో లేని ఇంటర్నెట్ సేవ
![స్తంభించిన రిజిస్ట్రేషన్.. తప్పని పరేషాన్ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07blr11-120011_mr-1738981773-1.jpg)
స్తంభించిన రిజిస్ట్రేషన్.. తప్పని పరేషాన్
Comments
Please login to add a commentAdd a comment