![మెట్రో చార్జీలను పెంచింది కేంద్రమే](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/09bng106_mr-1739300648-0.jpg.webp?itok=aUkBXCR1)
మెట్రో చార్జీలను పెంచింది కేంద్రమే
బనశంకరి: బెంగళూరులో మెట్రో రైలు టికెట్ ధరల పెంపుపై ప్రజలతో పాటు బీజేపీ కూడా విమర్శలు గుప్పిస్తోంది. అయితే ధరల పెంపు మా నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రో చార్జీలపై ఇవీ వాస్తవాలని పలు అంశాలను వివరించారు. విపక్ష బీజేపీ నేతలు అసత్య ప్రచారంతో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఓ పక్క మైట్రో రైలు నిర్మాణం కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది అని డప్పు కొట్టుకునే బీజేపీ నేతలు, చార్జీలపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వ పనేనని విమర్శలు చేయడం ఆత్మవంచనగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బెంగళూరు మెట్రోరైలు మండలి ఏర్పాటు అయ్యింది, ఇందులో తలా చెరి సగం భాగస్వామ్యం ఉందన్నారు. 2017 తరువాత చార్జీలను పెంచలేదు, పెంపునకు అనుమతి ఇవ్వాలని మెట్రో సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. కేంద్రం ధరల పరిశీలనకు కమిటీ వేసి అనుమతి ఇచ్చిందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏముందని ప్రశ్నించారు.
రాష్ట్రానికి సంబంధం లేదు: సీఎం
Comments
Please login to add a commentAdd a comment