![మహిమ గల రాగి పాత్ర.. రూ. వందల కోట్లు!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11bng09-120022_mr-1739300648-0.jpg.webp?itok=USe4FZGK)
మహిమ గల రాగి పాత్ర.. రూ. వందల కోట్లు!
బనశంకరి: పారిశ్రామికవేత్తను మోసగించిన ఐదుమంది వంచకులను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. కేసు గురించి ఆయన విలేకరులకు వివరించారు. సుకీర్తి, ఇనాయత్‌వుల్లా, జాకీర్, ప్రతీక్, ఉమేశ్ అనే ఐదుమంది ముఠాగా ఏర్పడి శేషాద్రిపురంలో ఓ కంపెనీ యజమానిని పరిచయం చేసుకున్నారు. పురాతనమైన మహిమాన్విత రాగి పాత్ర మా వద్ద ఉంటే అమ్మేశాము, దాని వల్ల వందల కోట్ల రూపాయలు వచ్చాయి, అయితే ఆ డబ్బు ఆర్‌బీఐలో ఉంది, పన్ను కట్టి డ్రా చేసి నీకు వాటా ఇస్తామని నమ్మించారు. అలా రూ.37.50 లక్షలు వసూలు చేశారు. చివరకు మొండిచేయి చూపడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు జరిపి నిందితులను అరెస్టు చేసి 2 కార్లు, 5 మొబైల్స్, 2 నకిలీ ఆర్‌బీఐ ఫైల్స్, రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
సైకో రౌడీ కోసం గాలింపు
యశవంతపుర: బెంగళూరు ఇందిరానగరలో ఐదు మందిపై దాడి చేసి పరారైన రౌడీ కదంబ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తూర్పు విభాగం డీసీపీ నేతృత్వంలో వెతుకుతున్నట్లు కమిషనర్ దయానంద తెలిపారు. ఈ నెల 8న రౌడీ కదంబ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల మధ్య ఐదు మందిపై దాడి చేసి గాయపరిచి పరారయ్యాడు. ఒక బైకిస్టు, ఇద్దరు పానీపూరి వ్యాపారులు, ర్యాపిడో బైకిస్టు, సెక్యూరిటీ గార్డు బాధితుల్లో ఉన్నారు.
మోసకారి ముఠా అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment