● మైసూరు గొడవలపై అశోక్ ధ్వజం
మైసూరు: రాష్ట్రంలో చట్టానికి గౌరవం లేకుండాపోయింది. శాంతిభద్రతలు కరువయ్యాయి. మైసూరు ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడులు చేస్తుంటే మనం కర్ణాటకలో ఉన్నామా, లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అనేది అర్థం కావడం లేదని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఉదయగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. హుబ్లీలో ఇలాంటి గొడవలే జరిగితే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ నిందితులను కాపాడారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవన్నారు. ఈ దాడిలో 15 మందికి పైగా పోలీసులు యపడ్డారని, వారు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. ఉదయగిరి పాకిస్తాన్‌లో ఉందా అనే అనుమానం వస్తోందన్నారు.
ఏ దేశంలో ఉన్నాం: సీటీ
దొడ్డబళ్లాపురం: మైసూరులోని ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి డిమాండు చేశారు. పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి పోలీసులపై దాడి చేశారంటే మనం ఏ దేశంలో ఉన్నాం? ఇది భారతదేశమా, పాకిస్తానా లేక ఆఫ్ఘనిస్తానా అని దుయ్యబట్టారు. చిన్న విషయాన్ని సాకుగా తీసుకుని ఈ దాడులకు పాల్పడ్డారన్నారు. ఒకవర్గం వారే ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతారన్నారు.
కేంద్రమంత్రి ఫోటో ఏదీ?
దొడ్డబళ్లాపురం: ప్రోటోకాల్ విషయంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ప్రభుత్వం పత్రికలలో ఇచ్చిన ప్రకటనలలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ గెహ్లాట్ ఫోటోలు లేవన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించేవారి ఫోటోలు ఎందుకు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment