హోంమంత్రి క్షమాపణ చెప్పాలి..
సత్తుపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో గురువారం అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దళితులకే కాక అందరి హక్కులను కాపాడేందుకు పోరాడారని తెలిపారు. ప్రజల హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడిని అవమానించేలా అమిత్‌షా వ్యాఖ్యలు చేస్తే ప్రధాని నరేంద్రమోదీ సమర్ధించడం గర్హనీయమని పేర్కొన్నారు.
ముగిసిన జిల్లా మహాసభలు
సత్తుపల్లిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా మహాసభలు గురువారం ముగిశాయి. ఈ సభల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనుల్లో అభద్రతా భావం పెరిగిందన్నారు. మతం పేరుతో ప్రజలను వర్గీకరిస్తూ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాగా, కమ్యూనిస్టులకు అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యాన ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రేణులు పోరాటాలు చేయాలని సూచించారు. నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఎర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, పి.నాగరాజు, వై.విక్రం, మోరంపూడి పాండు రంగారావు, నాయుడు వెంకటేశ్వరరావు, జాజిరి జ్యోతి, కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మహాసభల్లో చివరిరోజు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించారు.
అంబేద్కర్‌ను అవమానించడం
గర్హనీయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం
జిల్లా కార్యదర్శిగా మరోమారు ‘నున్నా’
సీపీఎం జిల్లా నూతన కమిటీని మహాసభల్లో ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా నున్నా నాగేశ్వరరావు మరోమారు ఎన్నికయ్యారు. అలాగే, కార్యదర్శివర్గ సభ్యులుగా ఎర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కల్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, భూక్యా వీరభద్రం, యనమదల విక్రం, బొంతు రాంబాబు, బండి పద్మ, ఎర్రా శ్రీనివాసరావు, మాదినేని రమేష్ ఎన్నిక కాగా 42మందిని జిల్లా కమిటీ సభ్యులుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment