మధిర స్టేషన్‌లో పరిశీలించిన డీఆర్‌ఎం
మధిర: అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న మధిర రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్(డీఆర్‌ఎం) భర్తేశ్‌కుమార్ గురువారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయనకు మ్యాప్‌ల ఆధారంగా పనుల వివరాలను అధికారులు వెల్ల డించారు. ఈమేరకు స్టేషన్‌లోని 1, 2వ నంబర్ ప్లాట్‌ఫారంలపై పర్యవేక్షించిన డీఆర్‌ఎం పనుల వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ సూచనలు చేశారు. రూ.25కోట్ల నిధులతో చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపించకుండా పర్యవేక్షించడంతో పాటు త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే, మూడో లైన్ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. డీఆర్‌ఎం వెంట వివిధ విభాగాల రైల్వే అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment