ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లా పర్యటనకు వచ్చిన బీసీ సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనర్ బాల మాయాదేవి సోమవారం ఖమ్మం నగరంలోని బీసీ సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతిగృహాలను సందర్శించారు. నగరంలోని పాకబండబజార్‌లో గల బాలికల హాస్టళ్లలో ఆవరణ, కిచెన్, గదులను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు నాణ్యమైన భోజనం, వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. వసతిగృహాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి టిఫిన్ తిన్నారు. ఆమె వెంట జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జి.జ్యోతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment