20లక్షల ఇళ్లు కట్టబోతున్నాం..
పెనుబల్లి: తెలంగాణ రాకముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 25.35 లక్షల మంది పేదల కోసం ఇళ్లు నిర్మిస్తే, తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ గృహాల పేరుతో రూ.కోట్లు దండుకుందే తప్ప పేదలకు న్యాయం చేయలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెనుబల్లిలో గురువారం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన కల్లూరు, పెనుబల్లి మండలాల లబ్ధిదారులు 152 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో తాము రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల మేర అప్పులు భారం మోసినా సంక్షేమ పథకాలు నిర్విగ్నంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఇక భూములకు సంబంధించి సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. కాగా, తాను పుట్టిన పెరిగిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని పాలేరుతో సమానంగా అభివృద్ధి చేస్తానని మంత్రి ప్రకటించారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని చెప్పారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ నియోజకవర్గానికి 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు పెనుబల్లిని నగర పంచాయతీగా చేయాలని కోరారు. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కల్లూరు మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్లు భాగం నీరజ, రాజబోయిన కోటేశ్వరరావుతో పాటు డాక్టర్ మట్టా దయానంద్, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కీసర శ్రీనివాసరెడ్డి, బండి వెంకటేశ్వరరావు, చీకటి రామారావు, బుక్కా కృష్ణవేణి, కోటేశ్వరరావు, కోట్లపల్లి వెంకటేశ్వరరావు, పసుమర్తి విశ్వనాథ్, బాపిరెడ్డి, మాధవరెడ్డి, కమలాకర్‌రావు, మాధవరావు, కిషోర్, నవజీవన్, కాంతయ్య, దామోదర్, కిరణ్, రామకృష్ణ పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన
తల్లాడ/కల్లూరు: తల్లాడ మండలంలోని అంబేద్కర్ నగర్–పినపాక మధ్య, కల్లూరు మండలం పాయపూర్ నుంచి ముచ్చవరం వరకు నిర్మించే బీటీ రహదారుల పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పీఆర్ ఈఈ రాంకోటిరెడ్డి, డీఈ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, నీరజాదేవి, వైకంఠి శ్రీనివాసరావు, ఊటుకూరు సందీప్, గణేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
పాలేరుతో సమానంగా సత్తుపల్లి అభివృద్ధి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. భద్రాద్రి జిల్లా సుజాతనగర్, పాల్వంచ మండలం ప్రభాత్‌నగర్, పాండురంగాపురం, లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ, కొత్తగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను ఆయన ప్రారంభిస్తారు. అలాగే, సాయంత్రం 3–30గంటల నుంచి ఖమ్మం కలెక్టరేట్‌లో మున్నేటిపై రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్షిస్తారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ ఎం.వెంకటాయపాలెం, తనగంపాడు, కాచిరాజుగూడెం, ఆరెకోడు తండాల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment