నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నా రు. ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లిలోని డైట్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వా త సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ రాష్ట్రస్థా యి వాలీబాల్ పోటీలను ప్రారంభిస్తారు. ఇక శని వారం ఉదయం బుగ్గపాడు, కాకర్లపల్లిలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభి స్తారు. అలాగే, మధ్యాహ్నం 12గంటలకు తల్లాడ మండలం నూతనకల్‌లో కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.
నేడు ‘నిధి ఆప్ కే నికట్’
ఖమ్మంసహకారనగర్: సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శుక్రవారం ‘నిధి ఆప్ కే నికట్’ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రబీలాల్‌దాస్, కె.సునీల్ ఓ ప్రకటనలో తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు ఆన్‌లైన్ సేవల విధివిధానాలు, కొత్త సంస్థల యజమానులకు పరిచయం, పెన్షనర్ల సమస్యల పరిష్కా రం ఉంటుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లావాసుల కోసం ఖమ్మంలోని మమత ఎడ్యుకేషనల్ సొసైటీలో, భద్రాద్రి జిల్లా వాసులకు ఇల్లెందులోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9–15నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన
వైద్యసేవలే లక్ష్యం
నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. నేలకొండపల్లిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించడంతో పాటు చికిత్స కోసం వచ్చిన వారితో సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమై డీసీహెచ్‌ఓ సమయపాలన, వైద్యసేవలపై సూచనలు చేశారు. కాగా, స్థానికులు జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, సోమనబోయిన సాయినవీన్, కడియాల నరేష్ తదితరులు ఆయనకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
తడిసిన ధాన్యంతో
తంటాలు
నేలకొండపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యం, అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న జల్లులు వెరసి రైతుల పాలిట శాపంగా మారాయి. నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం, మంగాపురంతండా తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో తడిసింది. ధాన్యం రాశుల చుట్టూ నీరు చేరడంతో గురువారం పలువురు రైతులు నీరు ఎత్తిపోయడమే ధాన్యాన్ని ఆరబెడుతూ కనిపించారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని త్వరగా కాంటాలు వేయించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment